ఐఎమ్ఎఫ్‌లో భారత మహిళ రికార్డ్.. అదనంగా ప్రమోషన్

by  |

దిశ, వెబ్‌డెస్క్: భారతీయుల టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడూ ముందుంటున్నాయి. ఇటీవల ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ను నియమించిన విషయం తెలిసిందే. పరాగ్‌కు తక్కువ అనుభవం ఉన్నగానీ అతనిలో టాలెంట్‌ను చూసి ట్విట్టర్ సీఈఓగా గౌరవాన్ని ఇచ్చింది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ఓ భారతీయ మహిళను అత్యున్నత పదవితో సత్కరించింది. కోలకత్తాకు చెందిన గీతా గోపీనాథ్‌కు ఐఎమ్ఎఫ్ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. గీతా గోపీనాథ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ ఎకనామిక్స్ చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత కొంతకాలం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా పని చేశారు.

IMF అంటే..

ఐఎమ్ఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేస్తుంది. ఇందులో ఇప్పటికే గీతా గోపీనాథ్ అనే భారతీయ మహిళ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తుంది. ఈమెకు ఇటీవలే ఐఎమ్ఎఫ్‌లోనే రెండో స్థానాన్ని అందించింది. అయితే ప్రస్తుతం ఆమెను ‘డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్’ గా సంస్థ ప్రమోట్ చేసింది. త్వరలోనే ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ పదవీకాలం ముగియనుంది. అయితే ఆమె కోవిడ్-19 సమయంలో సంస్థ కోసం చాలా కష్టపడింది. అందుకే ఐఎమ్ఎఫ్ సంస్థ తనను వదులుకోవడం ఇష్టంలేక తన పదవి కాలాన్ని పొడగించడంతో పాటు ఇప్పుడు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేశారు. ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జియేవా మాట్లాడుతూ.. గీతా గోపీనాథ్‌లో కష్టపడే తత్వం ఉందని.. గీతా గోపీనాథ్ ఈ పదవిని స్వీకరించడం సంతోషమని అన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed