మ్యాచో స్టార్ ‘పక్కా కమర్షియల్’ అయిపోయాడేంటి?

by  |
మ్యాచో స్టార్ ‘పక్కా కమర్షియల్’ అయిపోయాడేంటి?
X

దిశ, సినిమా: మ్యాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ‘పక్కా కమర్షియల్’ పేరుతో వస్తున్న సినిమా హై డోస్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని హామీనిచ్చిన మేకర్స్.. మార్చి 5 నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కాగా ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఫైనల్ అయిందని టాక్.

Next Story

Most Viewed