నటుడు శివాజీ గణేశన్‌కు గూగుల్ నివాళి

by  |
నటుడు శివాజీ గణేశన్‌కు గూగుల్ నివాళి
X

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్‌కు నివాళులు అర్పించింది గూగుల్ ఇండియా. ఆయన 93వ జయంతిని పురస్కరించుకుని స్పెషల్ డూడుల్‌తో ట్రిబ్యూట్ ఇచ్చింది. ఈ విషయంపై ట్వీట్ చేసిన శివాజీ గణేశన్ మనవడు, నటుడు విక్రమ్ ప్రభు గూగుల్ ఇండియా టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ డూడుల్ డిజైన్ చేసిన బెంగళూర్ బేస్డ్ ఆర్టిస్ట్ నూపుర్ రాజేశ్ చోక్సీకి థాంక్స్ చెప్పాడు. ఇది మరొక ప్రౌడ్ మోమెంట్ అని, తాతను చాలా మిస్ అవుతున్నానని తెలిపాడు. కాగా అక్టోబర్ 1, 1928లో జన్మించిన శివాజీ గణేశన్‌ అసలు పేరు వి. చిన్నయ్య మన్‌రయర్ గణేశమూర్తి కాగా… కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా ప్రేక్షకుల మన్నననలు అందుకున్నాడు. అలాగే ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్సు అందుకున్న చిన్నయ్య.. ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఇక ఫారిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌-1960లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలవడం విశేషం.



Next Story

Most Viewed