ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు గూగుల్ గుడ్‌బై?

by  |
ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు గూగుల్ గుడ్‌బై?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతూ, ఏసీ గదుల్లో సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు దంచికొడతారే తప్ప.. దాన్ని పాటించే విషయంలో మాత్రం చిత్తశుద్ధి కరువైంది. కానీ టెక్ దిగ్గజం గూగుల్ తాను అమలు చేసి చూపిస్తానని అంటోంది. ఇటీవల తమ కంపెనీకి సంబంధించిన క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది గూగుల్. అందులో 2030 నాటికి తాము కర్బన రహిత కంపెనీగా ఎదగాలనే లక్ష్యాన్ని విధించుకుంది. అలాగే కొన్ని కొత్త లక్ష్యాలు, ఆశయాలను కూడా గూగుల్ తమ క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌లో చేర్చింది. అవేంటంటే..

2025లోగా తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌ను ప్లాస్టిక్ రహితం చేస్తామని, ఒకవేళ ప్లాస్టిక్ వినియోగించినా దాన్ని పునర్వినియోగించేలా చర్యలు తీసుకుంటామని గూగుల్ తెలిపింది. అలాగే అన్ని షిప్పింగ్‌లను వంద శాతం కార్బన్ న్యూట్రల్ చేస్తామని ప్రకటించింది. తద్వారా తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ డబ్బాలను సుస్థిరపరిచి, రీసైకిల్ చేసుకునే వీలు కల్పిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పిక్సెల్, నెస్ట్ ఉత్పత్తులన్నీ రీసైకిల్ చేయదగిన మెటీరియల్స్‌తో డిజైన్ చేయబడినవని చెప్పింది. ఈ నియమాలు పాటించడం కంపెనీకి సంబంధించిన పర్యావరణ లక్ష్యాల్లో భాగమని, వాటిని పాటించడం ద్వారా భూవాతావరణాన్ని కాపాడటంలో తమ వంతు కృషి చేస్తామని గూగుల్ పేర్కొంది.


Next Story

Most Viewed