కేసీఆర్ నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం

by Shyam |

<p>దిశ, పటాన్‌చెరు: ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఎదురుచూస్తున్న సంగారెడ్డి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోన స్థితిగతులపై వైద్య శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, పలు జిల్లాలో మెడికల్ కాలేజీలో ఏర్పాటు అంశం పై కూడా చర్చకు రావడంతో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డిలో వైద్య కళాశాలను ఏర్పాటు [&hellip;]</p>

కేసీఆర్ నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం
X

దిశ, పటాన్‌చెరు: ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఎదురుచూస్తున్న సంగారెడ్డి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోన స్థితిగతులపై వైద్య శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, పలు జిల్లాలో మెడికల్ కాలేజీలో ఏర్పాటు అంశం పై కూడా చర్చకు రావడంతో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామంటూ రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) మెడికల్ కాలేజ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

సిద్దిపేట కాలేజీకి ఇచ్చినట్లుగానే సంగారెడ్డికి కూడా ముందుగానే రూ.1000 కోట్లు మంజూరు చేయాలని, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 200 పడకలు ఉండగా, వీటికి అదనంగా 500 పథకాలను మంజూరు చేయాలని కోరారు. మొన్నటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా సంగారెడ్డి మెడికల్ కాలేజీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. సీఎం హామీ ఇచ్చినందున తప్పకుండా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని ఈటల ప్రకటించారు. గత హామీలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుండడంతో జిల్లాలోని విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించడానికి అనువుగా ఉంటుంది. అలాగే ప్రజలకు హైదరాబాద్ నగరానికి వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే చికిత్స చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.

వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయంపై హర్షం

జిల్లా కేంద్రం సంగారెడ్డి జిల్లా వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. శాసనసభ్యుడిగా గతంలో పలుమార్లు మెడికల్ కాలేజీ ఏర్పాటు అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్థల అన్వేషణలో అధికారులు, పార్టీ శ్రేణులు

సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సుమారు 40 ఎకరాల స్థలం అవసరం. ఆ స్థలం కోసం అధికారులు, టిఆర్ఎస్ నాయకులు అన్వేషిస్తున్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న స్థలంతో పాటు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న స్థలాన్ని, పాత కలెక్టరేట్ స్థలాన్ని మెడికల్ కాలేజీ కోసం తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి ఉండాలి కాబట్టి ప్రస్తుతం 500 పడకలతో ఉన్న జిల్లా ఆసుపత్రిని ఇందుకు వినియోగించుకోవచ్చన్న యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఏ కారణాల చేతనైనా స్థలాన్ని తీసుకోని పక్షంలో కంది, కొండాపూర్ మండలాల్లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Next Story