మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. KTR ఎంట్రీతో టైమింగ్స్ చేంజ్.!

by  |
Hyderabad Metro
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని మెట్రో ట్రైన్ ప్రయాణికులకు త్వరలో గుడ్ న్యూస్ రానుంది. మహానగరంలో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్న మెట్రో.. నగరవాసులకు ఎంతో ఉపశమనం కల్గిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీకి ధీటుగా ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. అయితే, ఇప్పటి వరకూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే, కరోనా తగ్గిపోవడంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు తెరుచుకున్నాయి. దీంతో మార్నింగ్ ఆఫీస్‌కు వెళ్లేవారు ఉదయం 6 గంటలకే మెట్రో స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కానీ, ఉదయం 7 గంటల వరకు మెట్రో స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు వేచిచూడాల్సి వస్తోంది. అయితే, దీనిపై ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

ట్వీట్‌లో వీడియోని జత చేసి ‘‘@KTRTRS @KTRoffice Request you to start Metro by 6AM @Hyd, Most trains reach by 6 & people are having 2 wait 4d last 1 Hour 4 Metro 2 begin, Cabs r expensive in early hours & wastin 1hr on a Monday morning is expensive 4us!’’ పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. నెటిజన్ అభ్యర్థనను అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. దీనిపై ఆలోచించాలంటూ హైదరాబాద్ మెట్రో ఎండీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

దీనిపై HMRL MD స్పందిస్తూ తప్పకుండా సర్ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చొరవతో నగరంలో మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో టైమింగ్స్ మారనున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed