- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 8న రాష్ట్రంలోకి రుతుపవనాల రాక
by Shyam |
<p>హైదరాబాద్: కరోనాతో కుదేలవుతున్న రైతాంగానికి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది జూన్ 8నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గతేడాది జూన్ 23న ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. ఈసారి ముందుగానే వస్తుండటం విశేషం. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన తేదీలను ఐఎండీ విడుదల చేసింది. ఇవి జూన్ 1న కేరళను తాకనుండగా, 8న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే, ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ […]</p>

X
హైదరాబాద్: కరోనాతో కుదేలవుతున్న రైతాంగానికి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది జూన్ 8నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గతేడాది జూన్ 23న ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. ఈసారి ముందుగానే వస్తుండటం విశేషం. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన తేదీలను ఐఎండీ విడుదల చేసింది. ఇవి జూన్ 1న కేరళను తాకనుండగా, 8న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే, ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది.
Tags: southwest Monsoon, kerala, telangana, june
Next Story






