తెలంగాణలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి గుడ్‌న్యూస్

by  |
తెలంగాణలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. నేటి నుంచి తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డులో పేరున్న ప్రతీ ఒక్కరికీ 15 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. కేంద్రం ఇచ్చిన 2 నెలల కోటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేయనుంది. అయితే మే, జూన్‌ నెలల్లో.. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

కానీ, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటంతో మే నెలలో కేంద్రం ఇచ్చే కోటాను పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి కేవలం 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. ఈ నెలలో కేంద్రం కోటా, రాష్ట్రం కోటా కలిపి పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ కోటా కింద కేంద్రం కోటా 10 కిలోలు, రాష్ట్రం కోటా 5 కిలోలు కలిపి ఒక్కొక్కరికి 15 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తారు.


Next Story

Most Viewed