నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌‌‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలిచ్చింది. అలాగే కొత్త ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్లతోపాటు నోటిఫికేషన్‌లో పొందుపరచనున్న పోస్టుల విభాగాలను జాబ్ క్యాలెండర్‌లో పొందుపరచాలని సూచించింది. ఇదిలా [&hellip;]</p>

Jobs
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌‌‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలిచ్చింది.

అలాగే కొత్త ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్లతోపాటు నోటిఫికేషన్‌లో పొందుపరచనున్న పోస్టుల విభాగాలను జాబ్ క్యాలెండర్‌లో పొందుపరచాలని సూచించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని నిరుద్యోగులు ఎలా స్వాగతిస్తారో వేచి చూడాలి.

Next Story