ఆర్మూర్ ప్రజలకు గుడ్‌న్యూస్.. జీవన్ రెడ్డికి కేసీఆర్ కీలక హామీ

by  |
MLA Jeevan Reddy
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. నియోజకవర్గ పరిధిలో నూతనగా నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాల (లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్)కు నిధుల మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే జీవన్ కలిసి సమస్యలు విన్నవించారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్, మచ్చర్ల, మాక్లూర్ మండలం చిక్లి, గుంజిలి గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి, నిధుల మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed