- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పండుగకు TSRTC బంపర్ ఆఫర్
<p>దిశ, పటాన్‌చెరు : టీఎస్ఆర్టీసీ బస్సులో పండుగకు సాధారణ చార్జీలే ఉంటాయని సోమవారం బెల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఈవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పండుగ సందర్భంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను కూడా రెగ్యులర్ బస్సులలాగే సాధారణ చార్జీలపై ప్రయాణికులను చేరవేయడానికి సమాయత్తమైందని […]</p>

దిశ, పటాన్‌చెరు : టీఎస్ఆర్టీసీ బస్సులో పండుగకు సాధారణ చార్జీలే ఉంటాయని సోమవారం బెల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఈవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పండుగ సందర్భంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను కూడా రెగ్యులర్ బస్సులలాగే సాధారణ చార్జీలపై ప్రయాణికులను చేరవేయడానికి సమాయత్తమైందని తెలిపారు.
ఈ ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లిల మీదుగా ఖమ్మం, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర దూర ప్రాంతాలకు కావలసినన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైనదని అన్నారు. కావున ప్రయాణికులు సాధారణ చార్జీ కన్నా ఎక్కువ చార్జీలు పెట్టి ప్రయాణించి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
ఎటువంటి అదనపు చార్జీలు లేని టీఎస్ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు. అలాగే దాదాపు 30 మంది గ్రూపుగా మారితే.. వారు కోరుకున్న కాలనీలకు వారి చెంతకే బస్సులు పంపే ఏర్పాట్లు కూడా చేసినట్టు ఆయన పేర్కొన్నారు.






