రైతులకు కేంద్రం శుభవార్త.. త్వరలో అకౌంట్‌లో డబ్బులు..

by Harish |

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు (PM-KISAN) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద నగదు బదిలీ మూడు విడతలుగా చేస్తారు. మొదటి విడత ఏప్రిల్-జూలై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య నగదు జమ చేస్తారు. నూతన సంవత్సర కానుకగా మూడో విడత రూ.2000 లను దేశంలోని లక్షలాది మంది రైతులకు డిసెంబర్ 15 నాటికి జమ [&hellip;]</p>

రైతులకు కేంద్రం శుభవార్త.. త్వరలో  అకౌంట్‌లో డబ్బులు..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు (PM-KISAN) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద నగదు బదిలీ మూడు విడతలుగా చేస్తారు. మొదటి విడత ఏప్రిల్-జూలై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య నగదు జమ చేస్తారు. నూతన సంవత్సర కానుకగా మూడో విడత రూ.2000 లను దేశంలోని లక్షలాది మంది రైతులకు డిసెంబర్ 15 నాటికి జమ అయ్యే అవకాశం ఉంది.

PM-KISAN పథకం ఫిబ్రవరి, 2019 లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. భూమి రికార్డులలో పేర్లు ఉన్న రైతులకు ఈ సహాయం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ ఉన్న రిటైర్డ్ పెన్షనర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారు అర్హులు కాదు.

పూర్తి వివరాల కోసం pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి

Next Story