మెట్రో ప్రయాణికులకు సువర్ణ ఆఫర్

43
Metro-Rail1

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు, మరింత సురక్షితంగా మెట్రో రైలులో ప్రయాణించేందుకు వీలుగా మెట్రో అధికారులు సువర్ణ ఆఫర్ ను ప్రకటించారు. గత సంవత్సరమే ఈ స్కీంను ప్రారంభించారు. కానీ, అప్పట్లో నెలకొన్న పాండమిక్ పరిస్థితుల్లో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిన మెట్రోరైలు అధికారులు ఇప్పుడు దసరా సందర్భంగా మళ్లీ సువర్ణ స్కీంను తెరపైకి తెచ్చారు. ఈ నెల 18 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న సువర్ణ స్కీం కింద మెట్రో ప్రయాణికులు పొందే ప్రయోజనాలిలా ఉన్నాయి. స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పులకు అయ్యే ఛార్జీలతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించనున్నారు. అలాగే 20 ట్రిప్పులకు అయ్యే ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం ఇవ్వనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు 40 ట్రిప్పులకు అయ్యే ఛార్జీలతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని ఈ సువర్ణ స్కీంతో ప్రయాణికులకు అవకాశమివ్వనున్నారు. మహానగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు బాగా దెబ్బ తినటంతో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకునేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..