- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీ..!
<p>దిశ, కంటోన్మెంట్ : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ చోరి జరిగిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అక్రమ్ బాబా కథనం ప్రకారం.. న్యూ బోయిన్పల్లి నూతన్ కాలనీకి చెందిన విజయలక్ష్మీకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండగా.. ఓ కుమార్తె మల్కాజిగిరిలో ఉంటోంది. దీంతో విజయలక్ష్మీ సాయిదర్శన్ అపార్ట్మెంట్లో ఒక్కరే ఉంటున్నారు. బుధవారం విజయలక్ష్మీ తన బంగారు అభరణాలను సరిచూసుకునేందకు అల్మారా నుంచి బయటకు తీయగా.. […]</p>

దిశ, కంటోన్మెంట్ : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ చోరి జరిగిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అక్రమ్ బాబా కథనం ప్రకారం.. న్యూ బోయిన్పల్లి నూతన్ కాలనీకి చెందిన విజయలక్ష్మీకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండగా.. ఓ కుమార్తె మల్కాజిగిరిలో ఉంటోంది. దీంతో విజయలక్ష్మీ సాయిదర్శన్ అపార్ట్మెంట్లో ఒక్కరే ఉంటున్నారు. బుధవారం విజయలక్ష్మీ తన బంగారు అభరణాలను సరిచూసుకునేందకు అల్మారా నుంచి బయటకు తీయగా.. అదే సమయంలో వేరే వ్యక్తులు రావడంతో పర్సును ఫ్రీజ్పై పెట్టింది. అనంతరం పర్సును లోపల పెట్టాలని భావించి ఫ్రీజ్పై చూడగా అభరణాలు కనిపించలేదు. విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్.. ఆ రోజు ఇంట్లోకి ఎవరెవరు వచ్చారో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






