- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్‌లో ‘గాజుల’ రూపంలో బంగారం పట్టివేత
<p>దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. అతని లగేజ్, పూర్తిగా బాడీ స్కాన్ చేసి చూడగా గాజుల రూపంలో గుట్టుగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. రూ. 12.4 లక్షల విలువ చేసే 244.150 గ్రాముల బంగారాన్ని […]</p>

X
దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
అతని లగేజ్, పూర్తిగా బాడీ స్కాన్ చేసి చూడగా గాజుల రూపంలో గుట్టుగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. రూ. 12.4 లక్షల విలువ చేసే 244.150 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story






