భారీగా తగ్గిన బంగారం!

by  |
భారీగా తగ్గిన బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారుల ఆసక్తి మొత్తం బంగారంపై పడటంతో ఇటీవల రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ధరలు భారీగా తగ్గిపోయాయి. గురువారం బంగరాం ధర ఒక్కసారిగా రూ. 47,327 వరకూ చేరింది. అయితే, శుక్రవారం మార్కెట్ల జోరు పెరగడంతో ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఒక్కసారిగా రూ. 1396 తగ్గిపోయి రూ. 45,862 జారింది. వెండి కూడా రూ. 1340 వరకూ తగ్గడంతో కిలో రూ. 42,911 వద్ద ఉంది. ఇండియాలో లాక్‌డౌన్ రెండవ దశ కొనసాగుతుండటంతో బంగారం విక్రయలు తగ్గిపోవడంతో ధరలు సైతం అంతేస్థాయిలో దిగజారాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడుతుండటంతో బంగారం ధర తగ్గడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అనిశ్చితి వల్ల రానున్న కొన్ని నెలల పాటు బంగారం ధరలు ఇవే ఒడిదుడుకుల మధ్య ఉండొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags: gold price, gold rate, mcx, bullion marketNext Story

Most Viewed