బంగారం పైపైకి.. నిలకడగా వెండి

by  |
బంగారం పైపైకి.. నిలకడగా వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం, పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులేస్తున్న క్రమంలో స్టాక్ మార్కెట్లు డీలాపడుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తుున్న బంగారం ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.46,250కి చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరిగి రూ.42,400కి చేరుకుంది.అయితే వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.69,300 వద్ద కొనసాగుతోంది.

అటు అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కి 0.07 శాతం తగ్గడంతో 1741 డాలర్లకు తగ్గింది. ఇక వెండి ధర 0.21 తగ్గడంతో 25.17 డాలర్లకు చేరుకుంది.


Next Story

Most Viewed