ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం ధర!

by  |
gold
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు భారీగా క్షీణించడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ తాజా.. వివరాల ప్రకారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 750 తగ్గి రూ. 49,150కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. 690 క్షీణించి రూ. 45,050 వద్ద ఉంది. పసిడి బాటలోనే వెండి ధరలు సైతం అధికంగా తగ్గాయి. మంగళవారం వెండి ధరలు రూ. 900 తగ్గి రూ. 69,500కి చేరుకుంది. గడిచిన నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మంగళవారం దిగొచ్చాయి.

పెళ్లిళ్ల ముహుర్తాలు ఉండటం, ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు దిగిరావడంతో పరిస్థితులు సానుకూలంగా మారాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గడిచిన వారం రోజుల్లో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం రూ. 2,000 వరకు తగ్గిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. విజ‌యవాడలో రూ. 49,150, రాజధాని ఢిలీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,500, ఆర్థిక రాజధానిలో రూ. 47,990, బెంగళూరులో రూ. 49,150, చెన్నైలో రూ. 49,460, పూణెలో రూ. 49,590, కోల్‌కతాలో రూ. 50,700గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,806 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 25 డాలర్లుగా ఉంది.


Next Story

Most Viewed