- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు బంగారం వెలికితీత ప్రారంభం
<p>దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో ఎట్టకేలకు బంగారం నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి-జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులను జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మొదలు పెట్టింది. పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ… నిక్షేపాల వెలికితీతకు 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. గతేడాది […]</p>

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో ఎట్టకేలకు బంగారం నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి-జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులను జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మొదలు పెట్టింది. పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ… నిక్షేపాల వెలికితీతకు 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం, కొన్నాళ్లు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడటంతో సమస్య మొత్తం తీరిపోయింది.






