- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1.16కేజీల బంగారం పట్టివేత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన ఓ గ్యాంగ్ అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్సెల్ బాక్స్‌లోని ఎలక్ట్రిక్ మెషిన్‌లో బంగారాన్నిపెట్టి రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. పట్టుబడ్డ ఎలక్ట్రిక్ మెషీన్‌లో 1.16 కేజీల బంగారం లభ్యం కాగా, దాని విలువ సుమారు రూ. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన ఓ గ్యాంగ్ అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్సెల్ బాక్స్‌లోని ఎలక్ట్రిక్ మెషిన్‌లో బంగారాన్నిపెట్టి రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. పట్టుబడ్డ ఎలక్ట్రిక్ మెషీన్‌లో 1.16 కేజీల బంగారం లభ్యం కాగా, దాని విలువ సుమారు రూ. 64 లక్షలు ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ కేసులో తిరువారూర్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Next Story






