- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బురద కుంటకు ఎక్కువ.. ప్రధాన రహదారికి తక్కువ
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ ప్రధాన రహదారి గత కొన్ని రోజులుగా బురద కుంటగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో ఇదే రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారుల్లో మాత్రం నేటికి చలనం రావడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నచిన్న వర్షాలకు ఈ రోడ్డు నీటి కుంటగా మారుతోంది. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. […]</p>

X
దిశ, గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ ప్రధాన రహదారి గత కొన్ని రోజులుగా బురద కుంటగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో ఇదే రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారుల్లో మాత్రం నేటికి చలనం రావడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నచిన్న వర్షాలకు ఈ రోడ్డు నీటి కుంటగా మారుతోంది. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఇదే రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పలువురు వాహనదారులు, బాధితులు కోరుతున్నారు.
Next Story






