క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద గో ఎయిర్‌కు రూ. 800 కోట్లు!

by  |
క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద గో ఎయిర్‌కు రూ. 800 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్‌కు బ్యాంకుల నుంచి రూ. 800 కోట్ల క్రెడిట్ లైన్ లభించినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిధులు సాయంగా లభించనున్నాయి. బ్యాంకింగ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, ఆగష్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించిన రుణ పునర్నిర్మాణ పథకానికి బడ్జెట్ కేరియర్ గో ఎయిర్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో తాజా క్రెడిట్ లైన్‌తో గో ఎయిర్ తన రుణాలను పునర్నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ నిధులు రాబోయే రెండేళ్ల వరకు గో ఎయిర్‌కు సరిపోతాయని తెలుస్తోంది.

గతేడాది నవంబర్‌లో ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ 3.0లో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2.0 కింద ఈ రుణాన్ని గో ఎయిర్‌కు రూ. 700 కోట్ల నుంచి రూ. 800 కోట్లకు పొడిగించారు. కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం..గో ఎయిర్ మొత్తం రుణం 2020, మార్చి చివరి నాటికి రూ. 1,780.6 కోట్లుగా ఉంది. మొత్తం వ్యాపారావసరాలకు నిధులు సమకూర్చేందుకు స్వల్పకాలిక రుణాలు పెరిగినందున మొత్తం అప్పు 2020, ఆగష్టు చివరి నాటికి రూ. 2,027.61 కోట్లకు పెరిగింది.


Next Story

Most Viewed