తెలంగాణలో ఇక ఇంటింటికి వైద్య పరీక్షలు.. !

by  |
medical
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో హెల్త్​ ప్రోఫైల్​ప్రాజెక్టును షురూ చేసేందుకు సర్కార్​అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నది. ఆన్లైన్ ​విధానం లో కొనసాగే ఈ ప్రక్రియకు హైదరాబాద్​ఐఐటీ తయారు చేసిన సాప్ట్​వేర్​ను వినియోగించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం సెక్రటేరియట్‌లో డెమోను పరిశీలించారు. త్వరలో మంత్రి హారీష్​, కేటీఆర్‌లు కూడా దీన్ని పరిశీలించనున్నారు. వచ్చే నెల‌లో ఫైలెట్​ ప్రాజెక్టుగా సిరిసిల్లా, ములుగు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హైరిస్క్​జాబితాను గుర్తించి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో పాటు సాధారణ వ్యక్తులకు రక్త, మూత్ర, షుగర్​, బీపీ, తదితర ప్రాథమిక పరీక్షలను ఇంటి వద్దనే చేస్తారు. ఆ తర్వాత గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్​ స్క్రీనింగ్‌ల కొరకు పీహెచ్‌సీలకు పంపనున్నారు.



Next Story