గ్లోబల్ ప్రేయర్స్ ఫర్ సుశాంత్

by  |
గ్లోబల్ ప్రేయర్స్ ఫర్ సుశాంత్
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో దేశమంతా ఒక్కటైంది. తన మరణం వెనుక అసలు కారణం తెలుసుకునేందుకు కుటుంబంతో పాటు కలిసి పోరాటం చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. సుశాంత్‌ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నమ్ముతున్న ఫ్యాన్స్.. సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ చనిపోయి రెండు నెలలు పూర్తికాగా, తన ఆత్మకు శాంతి చేకూరాలని గ్లోబల్ ప్రేయర్స్ కండక్ట్ చేస్తున్న సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ప్రార్థనలో పాల్గొనాలని కోరారు.

ఇందులో భాగంగా సుశాంత్ ఫ్రెండ్, హీరోయిన్ కృతి సనన్ ‘ప్రేయర్స్ అండ్ పాజిటివిటీ’ అంటూ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్న పిక్ షేర్ చేసింది. ప్రార్థన చేసేందుకు ఇది మంచి సమయం అన్న కృతి.. త్వరలో నిజం ప్రకాశిస్తుంది అని ధీమా వ్యక్తం చేసింది. మనం నమ్మే నిజం గురించి నిలబడినప్పుడు ద్వేషం పెంచుకోకూడదని సూచించింది.

https://www.instagram.com/p/CD5jwOqgCNt/?igshid=xg4ugbt81nxe

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గ్లోబల్ ప్రేయర్స్‌లో పాల్గొన్నారు రామ్ దేవ్ బాబా. సుశాంత్ కుటుంబం బాధ విన్నాక చలించిపోయానని తెలిపాడు.’పతంజలి తరపున మా ప్రార్థనలు ఎప్పటికీ ఉంటాయి.. ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది’అని తెలిపారు బాబా.

బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ సైతం సుశాంత్ కేసు విషయంలో తన వాయిస్ వినిపిస్తోంది. సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఆమె.. సుష్ కుటుంబానికి నిజం తెలియాల్సిన అవసరం ఉందని అంటోంది. వారితో పాటు తనను ప్రేమిస్తున్న ప్రతీ ఒక్కరి హక్కుగా భావిస్తున్నట్లు చెప్పింది జరీనా.

అద్భుత వ్యక్తి.. ఆశ్చర్యకరమైన ఆత్మ.. స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వం ఉన్న సుశాంత్‌ను మిస్ అవుతున్నట్లు తెలిపింది మాజీ లవర్ అంకిత లోఖండే. సుశాంత్ గ్లోబల్ ప్రేయర్స్‌లో పాల్గొన్న ఆమె నమస్కారం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ క్యాంపెయిన్ మద్దతు ఇవ్వాలని కోరింది.

https://twitter.com/anky1912/status/1294510622663569408?s=19

Next Story

Most Viewed