భారత యువతితో మ్యాక్స్‌వెల్‌ నిశ్చితార్థం

by  |
భారత యువతితో మ్యాక్స్‌వెల్‌ నిశ్చితార్థం
X

ఆస్ర్టేలియన్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తనదైన డాషింగ్ బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా మ్యాక్స్‌వెల్ అభిమానులను సంపాదించుకున్నాడు. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌తో మాక్స్‌వెల్ నిశ్చితార్థం భారతీయ సాంప్రదాయ శైలిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెల్‌బోర్న్‌ వేదికగా మారింది. మ్యాక్స్‌వెల్‌ తరపు బంధువులు కూడా చీరకట్టు, కుర్తా, పైజామాలు ధరించి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం విశేషం. కాగా మ్యాక్స్‌వెల్‌ భారతయ యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా నిలవనున్నాడు. అంతకుముందు ఆసీస్‌ పేసర్‌ షాన్‌ టైట్‌ భారత్‌కు చెందిన యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్‌ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్‌ సింఘా షాన్‌ టైట్‌ ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.

Tags: Glenn Maxwell, Engagement, indian girl Vini Raman, Melbourne

Next Story