నాతో శృంగారం చేస్తేనే ఆక్సిజన్ ఇస్తా.. కామాంధుడి వికృత చేష్టలు

by  |
sex with me
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాను కూడా శృంగారానికి వినియోగించుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఆపదలో ఉన్నాం ఆక్సిజన్ అందించి ఆదుకోండి అని అభ్యర్థించిన యువతిని తన కామ కోర్కెలు తీర్చాలని పట్టుపట్టాడు ఓ కామాంధుడు. వరసకు చెల్లి అయినా.. కామం ముందు అతడికి ఏ బంధం గుర్తుకు రాలేదు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఆ యువతి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శ్వాస తీసుకోలేక తీవ్ర అస్వస్థకు గుర‌య్యాడు. సకాలంలో ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ అందుబాటులో లేకపోవడంతో బయట తెచ్చుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో అతని కుమార్తె తన స్నేహితురాలి సహాయం కోరింది. దీంతో ఆమె తన ఇంటి సమీపంలో వరుసకు అన్న అయ్యే యువకుడికి విషయం తెలిపింది. తన ఫ్రెండ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగలేదని, వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయాలని కోరింది.

ఇదే అదునుగా భావించిన యువకుడు వరసకు చెల్లెలు అవుతుందన్న జ్ఞానం కూడా లేకుండా తనతో ఓ రాత్రంతా శృంగారం చేస్తేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానని చెప్పాడు. అతడి మాటలకు షాక్ తిన్న యువతి తన అసహనాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed