- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెడ్డీ స్లీప్..
<p>దిశ, శేరిలింగంపల్లి: టెడ్డీ బేర్స్.. వీటిని ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. కలర్ ఫుల్ టెడ్డీస్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా, ఏ మార్కెట్ కు వెళ్లినా ఈ టెడ్డీస్ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. చిన్న పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు వీటితో ఈజీగా లవ్ లో పడిపోతారు. అవి ఉంటే చాలు ప్రపంచంతో పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. టెడ్డీస్ కూడా మెత్తటి క్లాత్ తో, ముట్టుకుంటే సుతిమెత్తగా ఉండి వాటినే హత్తుకుపోవలని అనిపించేలా ఉంటాయి. చాలాకాలంగా టెడ్డీస్ […]</p>

దిశ, శేరిలింగంపల్లి: టెడ్డీ బేర్స్.. వీటిని ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. కలర్ ఫుల్ టెడ్డీస్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా, ఏ మార్కెట్ కు వెళ్లినా ఈ టెడ్డీస్ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. చిన్న పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు వీటితో ఈజీగా లవ్ లో పడిపోతారు. అవి ఉంటే చాలు ప్రపంచంతో పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. టెడ్డీస్ కూడా మెత్తటి క్లాత్ తో, ముట్టుకుంటే సుతిమెత్తగా ఉండి వాటినే హత్తుకుపోవలని అనిపించేలా ఉంటాయి. చాలాకాలంగా టెడ్డీస్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈమధ్యకాలంలో టెడ్డీస్ మరోసారి హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
మార్కెట్లను ముంచెత్తుతున్న టెడ్డీస్
నగరంలో టెడ్డీబేర్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ప్రధాన కూడళ్లలో వాహనాల్లో పెట్టి వీటిని విక్రయిస్తుంటారు. అలాగే జనరల్ స్టోర్స్, కిడ్స్ స్టోర్స్ లల్లోనూ ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయి. క్లాత్ ను బట్టి, సైజ్ ను బట్టి వీటి ధరలున్నాయి. మినిమం రూ. 200 నుండి రూ. 10 వేల వరకు ధరపలుకుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా, ప్రేమికుల రోజుకు ముందు ఈ టెడ్డీస్ బాగా అమ్ముడు అవుతున్నతాయని అమ్మకదారులు చెబుతున్నారు. చిన్నారుల కోసం, లవర్స్ కోసం బాగా కొనుగోలు చేస్తున్నారని, ధర ఎక్కువైనా ఇష్టమైన టెడ్డీస్ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెబుతున్నారు.
అమ్మాయిలకు అవే తోడూ నీడ..
టెడ్డీబేర్స్ ను అమ్మాయిలు బాగా ఇష్టపడుతుంటారు. చాలామంది గర్ల్స్ కు ఇవే బెస్ట్ ఫ్రెండ్స్. వీటితోనే ముచ్చట్లు పెడతారు, వాటితో ఊసులాడుతారు, వాటిని పట్టుకొని మురిసిపోతారు. అంతలా వాటికి అడిక్ట్ అయిపోతారు. కొందరు అమ్మాయిలు అయితే వాటిని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నారట. అవే ప్రపంచం అని బ్రతికేస్తున్నారు. టెడ్డీస్ లేకుండా నిద్ర పోవడం లేదంటే వాటికి ఎంతలా అడిక్ట్ అయ్యారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ టెడ్డీస్ కు వీలునప్పుడల్లా స్నానాలు చేయించే అమ్మాయిలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వాటిని అందంగా ముస్తాబు చేసి ప్రయాణాల్లో కూడా వెంట తీసుకు వెళ్తున్నారాట ఇంకొందరు. స్పెషల్ బెడ్రూం ఉన్న వాళ్లు, హాస్టల్స్ లో ఒంటరిగా ఉండే అమ్మాయిలకు టెడ్డీస్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు స్లీపింగ్ పాట్నర్స్ కూడా అని చెబుతున్నారు. టెడ్డీస్ వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా ఒంటరితనం అనే ఫీలింగ్ లేకుండా ఉంటుందని అంటున్నారు మానసిక నిపుణులు.
క్రేజీ టెడ్డీస్
టెడ్డీ స్లీప్ అనేది ఫారిన్ కంట్రీస్ లో చాలాకాలంగా ఉన్న ట్రెండ్. కానీ ఈమధ్యనే మన దేశంలోనూ ఈతరహా ట్రెండ్ స్టార్ట్ అయింది. నైన్ టీసులో వచ్చిన మూవీస్ లో హీరోయిన్స్ టెడ్డీ బేర్లను హగ్ చేసుకుని తమ ప్రియుడికి సంబంధించిన ముచ్చట్లు చెబుతూ ఊహల్లో ఊరేగే వారు. ఆతర్వాత కూడా చాలా మూవీస్ లో ఇలాంటి సీన్లు కనిపిస్తుంటాయి. చాలాకాలం తర్వాత ఈ తరహా ట్రెండ్ మరోసారి జోరందుకుంది. ఈమధ్య అమ్మాయిలు టెడ్డీస్ తో గడుపుతున్నారు. వాటితోనే నిద్రపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఖర్చు ఎక్కువైనా పర్లేదు అని పిల్లలకు టెడ్డీస్ కొనిపెడుతున్నారు. లవర్స్ కూడా తమ ప్రియురాలుకు టెడ్డీ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నారు. పింక్, రెడ్, వైట్ కలర్ టెడ్డీస్ బాగా సేల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ మీకు నచ్చిన వాళ్లకు ఓ టెడ్డీ కొనేయండి మరీ..









