అర్ధరాత్రి బాత్రూమ్ లో ఆ వీడియోల కోసం వెతికిన బాలిక.. తెల్లారేసరికి శవంలా

by  |
అర్ధరాత్రి బాత్రూమ్ లో ఆ వీడియోల కోసం వెతికిన బాలిక.. తెల్లారేసరికి శవంలా
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి యువతకు ప్రాణం విలువ తెలియడం లేదు. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఒక బాలిక సోషల్ మీడియాలో చూసి అద్దం ముక్కతో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో 13 ఏళ్ల బాలిక తల్లి, అన్న తో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి ఇటీవలే కరోనాతో మృతి చెందగా విజయవాడలో ఉంటున్న కుటుంబం అంబాజీపేటకు మారింది. ఇకపోతే తండ్రి చనిపోయాకా ఆకుటుంబంలో కలతలు మొదలయ్యాయి. కుటుంబ కలహాల వలన రోజు ఇంట్లో గొడవలు.. ఆ గొడవలకు కారణం బాలికనే అని అందరు అంటుండడంతో మనస్థాపానికి గురైన బాలిక సోమవారం అర్ధరాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి అద్దం ముక్కతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడుగులో కూతురిని చూసిన తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

చనిపోవడానికి ముందు రోజు తన వద్దకు వచ్చి చాకుతో గొంతు కోసుకొంటే త్వరగా చనిపోతారా..? బ్లేడుతో కోసుకొంటే త్వరగా చనిపోతారా..? అని అడిగిందని, తాను తిట్టేసరికి సామజిక మాధ్యమాలలో ఆత్మహత్యల వీడియోలు వెతికిందని, కానీ, చివరకు ఇలా చేస్తోందని అనుకోలేదని బాలిక తల్లి బోరున విలపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed