వాహ్.. చీరకట్టులో హులాహుప్ డ్యాన్స్!

by  |
వాహ్.. చీరకట్టులో హులాహుప్ డ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ :
చీరలో డ్యాన్స్ చేయడమంటే కాస్త కష్టమైన పనే. అందులోనూ హులాహుప్ (రింగు)తో స్టెప్పులు వేయాలంటే.. అది మరింత కష్టం. అయితే, ఈష్ణ అనే ఓ 23 ఏళ్ల డ్యాన్సర్.. చీరకట్టులో ఉండి, రింగుతో చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈష్ణ నృత్యాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసించారు. ‘ఇప్పటికే ఈ వీడియోను చూడటం చాలా లేట్ అయింది. కానీ చాలా ఆశ్చర్యం కలిగించింది’ అంటూ ఆయన కామెంట్‌ చేయడం విశేషం.

‘గెందాపూల్’ పాట యూట్యూబ్ వీక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఆ పాటపై ఈష్ణ చేసిన డ్యాన్స్ వావ్ అనిపిస్తోంది. సాధారణంగా స్త్రీలు చీరలు ధరించి డ్యాన్స్‌లు చేయడానికే కొంత ఇబ్బంది పడతారు. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన డాన్సర్‌ ఈష్ణ కుట్టి సంప్రదాయ చీరకట్టు, రన్నింగ్ షూస్ ధరించి అసాధారణమైన ‘హులా హూప్’ నృత్యం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

‘సారీఫ్లో’ హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో.. చీర కట్టులో హులాహూప్‌ డ్యాన్స్‌ వీడియోలు చేయాలని నా మనసులో ఉండేది. అది ఇప్పటికి తీరింది. స్త్రీలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సౌకర్యవంతంగా చీర ధరించి నృత్యం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఇండియాలో హుపర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సంఖ్య పెరుగుతోంది. మన సంప్రదాయంలో ఎంతో వైవిధ్యత ఉంది. కట్టుకునే శారీల్లోనూ అంతే వైవిధ్యత ఉంది. ఈ ట్రెండ్ గ్లోబల్ ఆర్ట్ ఫామ్‌లో ఓ కొత్త ఒరవడికి నాంది కావాలని ఆశిస్తున్నాను’ అని ఈష్ణ తన వీడియోతో పాటు ఈ మాటలను రాసుకొచ్చింది.


Next Story

Most Viewed