ప్రేమ వ్యవహారం.. యువకుడిని చితకబాదిన టీఆర్ఎస్ లీడర్

by Chintha Aamani |

<p>దిశ, బెల్లంపల్లి : ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన ఓ అధికార పార్టీ నేత యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు వెన్నం రాజశేఖర్ కథనం ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీలో నివాసముండే యువతి, తాను ప్రేమించుకుంటున్నట్లు తెలిపాడు. శనివారం రోజు అమ్మాయి తరపు బంధువులు అధికార పార్టీకి చెందిన రాగం శెట్టి సతీష్‌తో కలిసి తనను బెదిరించినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని ఆనచరులతో తనపై దాడికి పాల్పడ్డారని [&hellip;]</p>

ప్రేమ వ్యవహారం.. యువకుడిని చితకబాదిన టీఆర్ఎస్ లీడర్
X

దిశ, బెల్లంపల్లి : ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన ఓ అధికార పార్టీ నేత యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు వెన్నం రాజశేఖర్ కథనం ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీలో నివాసముండే యువతి, తాను ప్రేమించుకుంటున్నట్లు తెలిపాడు. శనివారం రోజు అమ్మాయి తరపు బంధువులు అధికార పార్టీకి చెందిన రాగం శెట్టి సతీష్‌తో కలిసి తనను బెదిరించినట్లు పేర్కొన్నాడు.

అంతేకాకుండా అతని ఆనచరులతో తనపై దాడికి పాల్పడ్డారని వివరించాడు. అమ్మాయి తరఫు బంధువులు, అధికార పార్టీ నేత సతీష్ వలన తనకు ప్రాణహాని ఉందని బాధిత యువకుడు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన సీఐ రాజు బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తులపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని సీఐ హామీ ఇచ్చినట్లు బాధిత యువకుడు తెలిపాడు.

Next Story