చిన్నారి ప్రాణం తీసిన యువకుడి నిర్లక్ష్యం, అతివేగం

by Sumithra |
చిన్నారి ప్రాణం తీసిన యువకుడి నిర్లక్ష్యం, అతివేగం
X

దిశ, పరిగి : రోడ్డు దాటుతున్న బాలికను దిచక్ర వాహనం ఢీ కొనడంతో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. చన్గొముల్ ఎస్ఐ శ్రీశైలం కథనం ప్రకారం.. పరిగి మండలం కాళ్లాపూర్​తండాకు చెందిన వెంకటేశ్వర్లు, దేవ్లీ బాయి భార్యాభర్తలు. వీరి కూతురు పవిత్ర (10) అమ్మమ్మ గారి ఊరైన రాకంచర్ల వద్దే ఉంటోంది.

సోమవారం రాత్రి కిరాణ షాపునకు వెళ్లి హైవే 163 రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలోనే మన్నెగూడ వైపు నుంచి బైక్ పై మోయినాబాద్​ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుండుమల్ల మహేందర్ గౌడ్ అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న పవిత్రను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పవిత్ర తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఇంటికి తీసుకువెళ్లే సరికి మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చన్గొముల్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. అల్లారుముద్దుగా పెరిగిన చిన్నారి పవిత్ర కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.



Next Story

Most Viewed