- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దారుణం.. ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. నగ్న వీడియోలతో వేధింపులు చివరికి…
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం కొత్తచెలికానివలసలో దారుణం జరిగింది. హరీశ్ అనే యువకుడు ఓ యువతి వెంట ప్రేమ పేరుతో తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అది నిజమని నమ్మిన యువతి అతడి ప్రేమను అంగీకరించింది. ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా అనుభవించాడు. ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆశ్లీల వీడియోలతో వేధించాడు. చివరకు ఆ వీడియోలను యువతి సోదరుడికి కూడా పంపించాడు. ఈ విషయం […]</p>

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం కొత్తచెలికానివలసలో దారుణం జరిగింది. హరీశ్ అనే యువకుడు ఓ యువతి వెంట ప్రేమ పేరుతో తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అది నిజమని నమ్మిన యువతి అతడి ప్రేమను అంగీకరించింది. ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా అనుభవించాడు. ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆశ్లీల వీడియోలతో వేధించాడు. చివరకు ఆ వీడియోలను యువతి సోదరుడికి కూడా పంపించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. తన సోదరుడికి తన నగ్న వీడియోలను ప్రియుడు పంపించాడని తెలుసుకున్న ప్రియురాలు అవమానాన్ని భరించలేక శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హరీశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతికి న్యాయం చేయాలని.. ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






