- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటర్ అనుకుని శానిటైజర్ తాగిన యువతి
by Shyam |
<p>దిశ, మెదక్: తాగు నీరు అనుకుని ఓ యువతి శానిటైజర్ తాగింది.ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. లౌక్‌డౌన్ కారణంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఎదురుగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువతి వాహనాన్ని పోలీసులు ఆపారు. వివరాలు సేకరించిన వారుఆమె బైకును సీజ్ చేశారు. అక్కడే నిలిచిన యువతికి కొద్ది […]</p>

X
దిశ, మెదక్: తాగు నీరు అనుకుని ఓ యువతి శానిటైజర్ తాగింది.ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. లౌక్‌డౌన్ కారణంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఎదురుగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువతి వాహనాన్ని పోలీసులు ఆపారు. వివరాలు సేకరించిన వారుఆమె బైకును సీజ్ చేశారు. అక్కడే నిలిచిన యువతికి కొద్ది సేపటికే దాహం కావడంతో పక్కనే టేబుల్‌పై పోలీసులు ఉంచిన శానిటైజర్‌ను నీళ్లు అనుకుని పొరపాటున తాగింది. అది గమనించిన ఓ యువకుడు ఆమెనుఅడ్డుకున్నాడు. శానిటైజర్ తాగిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
Tags: corona,lockdown, sanitizer drink, girl, medak
Next Story






