- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జామ తోటలో నగ్నంగా బాలిక.. అత్యాచారం చేసి ఆపై..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓ పన్నెండేళ్ల బాలిక సగం కాలిపోయిన శవమై.. జామ తోటలో అర్ధనగ్నంగా కనిపించింది. ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ దేహత్ జిల్లా జైతాపుర్గ్రామంలో కొందరు దుండగులు బాలికను కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న ఓ జామలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని అన్నారు. అయితే, బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కిడ్నాప్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఓ పన్నెండేళ్ల బాలిక సగం కాలిపోయిన శవమై.. జామ తోటలో అర్ధనగ్నంగా కనిపించింది. ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ దేహత్ జిల్లా జైతాపుర్గ్రామంలో కొందరు దుండగులు బాలికను కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న ఓ జామలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని అన్నారు.
అయితే, బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కిడ్నాప్ అయిన ముందు రోజు రాత్రి బాలిక ఇంటి ముందు నిద్రపోయిందని, ఉదయం లేచి చూసేసరికి ఆమె కనిపించకుండా పోయిందని అన్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వెతకగా జామ తోటలో సదరు బాలిక సగం కాలిన శవం అర్ధనగ్నంగా పడి ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ మంచం కూడా ఉందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.






