- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఓటర్లకు బంపర్ ఆఫర్
<p> ఎన్నికల వేళ తాయిళాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ఓటర్లను బూత్ వరకు తీసుకువెళ్లేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఎన్నికల సంఘం ఎలాగూ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా ఈ సారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇవాళ పోలింగ్ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయాలందించేందుకు ముందుకొచ్చాయి. ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత […]</p>

ఎన్నికల వేళ తాయిళాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ఓటర్లను బూత్ వరకు తీసుకువెళ్లేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఎన్నికల సంఘం ఎలాగూ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా ఈ సారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇవాళ పోలింగ్ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయాలందించేందుకు ముందుకొచ్చాయి. ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత సేవలు అందిస్తున్నాయి. బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలందిస్తుండగా, ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టికెట్లపై బేస్ చార్జీని రిటర్న్ ఇవ్వనున్నట్టు తెలిపింది.






