- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుధ్య కార్మికులకు ఆత్మీయ సత్కారం
<p>దిశ, హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని.. శ్రీ దయానంద మెమోరియల్ సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి జంగం బస్తీలోని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు మంగళవారం ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, సివిల్ సప్లయ్ ఏఎస్ఓ తనుజ, నాంపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నాయకురాలు ఆయేషా ఫరీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాల్లో విజృంభిస్తున్న కరోనా […]</p>

దిశ, హైదరాబాద్ :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని.. శ్రీ దయానంద మెమోరియల్ సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి జంగం బస్తీలోని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు మంగళవారం ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, సివిల్ సప్లయ్ ఏఎస్ఓ తనుజ, నాంపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నాయకురాలు ఆయేషా ఫరీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో కట్టడి చేయడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైందని అన్నారు. ఇక్కడి జంగం బస్తీలో ఈ 15 మంది కార్మికుల కారణంగానే వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఆవుల యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Corona Effect, GHMC Sanitation Staff, Nampally Jangam Basti, Batala Ramprasad






