- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికకు రేపు నోటిఫికేషన్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తి కానుండడంతో కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు ఈ నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తి కానుండడంతో కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు ఈ నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. దాఖలైన నామినేషన్ల వివరాలను ఈ నెల 19న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి, ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
Next Story






