- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బల్దియాలో 'కరోనా' అధికారులు వీరే..!
<p>దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నెల రోజులుగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థన అంశం వెలుగులోకి వచ్చాక.. హైదరాబాద్ నగరంపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,089 మంది ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళగా.. అందులో గ్రేటర్ పరిధిలోనే సుమారు 604 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన […]</p>

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నెల రోజులుగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థన అంశం వెలుగులోకి వచ్చాక.. హైదరాబాద్ నగరంపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,089 మంది ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళగా.. అందులో గ్రేటర్ పరిధిలోనే సుమారు 604 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ క్లస్టర్లలో గ్రేటర్ హైదరాబాద్ లోనే 126 ఉన్నాయి. దీంతో నగరంలోని కరోనా బాధితుల కేసుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న 30 సర్కిళ్లను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసేందుకు అధికారులను కేటాయించాలని సీఎం కేసీఆర్.. కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ 30 సర్కిళ్లకు 17 మంది సీనియర్ అధికారులను కేటాయిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. సర్కిళ్లవారీగా కేటాయించిన అధికారులు ఆయా సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లతోపాటు కొవిడ్-19 బాధ్యతలను చూసే ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సంబంధిత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

tags: Corona Effect, Special Officer Duty Corona, GHMC, Covid-19






