‘గని’ అప్‌డేట్.. పవర్‌ఫుల్ పంచెస్ విసిరేది అప్పుడే..

by  |
Ghani First Song
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ ‘గని’ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు సినిమా మేకర్స్ మరో సారి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 18న ‘గని’ రిలీజ్ కానుందని మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఇందులో భాగంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ ముఖంపై గాయం చూస్తుంటే సినిమా మ్యాచెస్ ‘డు ఆర్ డై’ అనేలా ఉండనున్నాయని అర్థం అవుతోంది. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ రింగ్‌లో నిల్చుని కనిపిస్తున్నాడు. దానికి తొడు ఒక్క చేయి మాత్రమే స్టాన్స్‌లో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే సినిమాలోని ఈ మ్యాచ్‌లో వరుణ్ చేతికి గాయం అవుతుంది. మరి ఆ మ్యాచ్ ‘గని’ ఎలా గెలుస్తాడో తెలియాలంటే మార్చి 18 వరకు వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed