‘బాడీ మాడిఫికేషన్’ అతనికో వ్యసనం!

by Shyam |   (  Updated:2020-08-29 06:53:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : చాలామంది హీరోయిన్లు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేసుకుంటారన్న విషయం తెలిసిందే. హీరోలు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇదంతా స్టార్ల వ్యవహారం. కానీ, ఇక్కడో వ్యక్తి తన తల ‘స్కల్’లా కనిపించేందుకు ఏకంగా చెవులు కోసేసుకున్నాడు. అంతేకాదు ఎన్నో సర్జరీలు చేయించుకుని కొమ్మలు పెట్టుకున్నాడు. ఈ రకంగా బాడీ మాడిఫికేషన్ కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు. పచ్చబొట్టు సంప్రదాయం పాతదే అయినా, కొత్త తరానికొచ్చేసరికి టాటూల పిచ్చి [&hellip;]</p>

‘బాడీ మాడిఫికేషన్’ అతనికో వ్యసనం!
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలామంది హీరోయిన్లు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేసుకుంటారన్న విషయం తెలిసిందే. హీరోలు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇదంతా స్టార్ల వ్యవహారం. కానీ, ఇక్కడో వ్యక్తి తన తల ‘స్కల్’లా కనిపించేందుకు ఏకంగా చెవులు కోసేసుకున్నాడు. అంతేకాదు ఎన్నో సర్జరీలు చేయించుకుని కొమ్మలు పెట్టుకున్నాడు. ఈ రకంగా బాడీ మాడిఫికేషన్ కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు.

పచ్చబొట్టు సంప్రదాయం పాతదే అయినా, కొత్త తరానికొచ్చేసరికి టాటూల పిచ్చి పీక్స్‌కు చేరింది. అయితే, జర్మనీకి చెందిన శాండ్రో మాత్రం.. ఈ టాటూ పిచ్చితో తన శరీరాన్ని రకరకాల ఆపరేషన్లతో హింసించుకుంటున్నాడు. తన ముఖం ‘స్కల్’లా కనిపించాలనే ఉద్దేశంతో, అందుకు అడ్డుగా ఉన్న చెవులను కోసేసుకున్నాడు. అంతేకాదు, ఆ లుక్ రావడానికి తన తలపై కొమ్ములు మొలుస్తున్నట్లు రెండు ఇంప్లాంట్స్‌ను కూడా పెట్టుకున్నాడు. ఇక అతని కాలు నుంచి ముఖం వరకు అంతటా టాటూలే దర్శనమిస్తాయి. ఈ క్రమంలోనే అతడు సోషల్ మీడియాలో ‘మిస్టర్ స్కల్’‌గా పేరుపొందాడు.

2007లో ఒకతను తన తలపై స్పైక్స్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న విషయం శాండ్రో చెవినపడింది. ఆ క్షణం నుంచి శాండ్రోకు ‘బాడీ మాడిఫికేషన్’ ఓ వ్యసనంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 బాడి మాడిఫికేషన్ సర్జరీలు చేయించుకున్నాడు. మొత్తంగా వీటికోసం ఇప్పటివరకు దాదాపు ఐదున్నర లక్షల రూపాయలను ఖర్చు చేశాడు. పైగా అతడి బాడీపై ఉన్న టాటూల కారణంగా పలు ఉద్యోగాలను సైతం పోగొట్టుకున్న శాండ్రో.. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా దూరమయ్యాడు. తన స్నేహితులు, ఫ్యామిలీ.. శాండ్రోను ఒఖ ‘సిక్ ఫ్రీక్’గా పరిగణిస్తారు. అయితే శాండ్రో అవేవీ కేర్ చేయడు. తన లుక్స్ పరంగా కాకుండా, తను చేస్తున్న పనుల ద్వారానే గుర్తించాలని అంటాడు.

‘చాలామంది నన్ను చూసి భయపడతారు. అలానే మరికొంతమంది నన్ను చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. ట్రెడిషనల్ పద్ధతుల నుంచి సంస్థలు ఇంకా బయటపడలేదు, అందుకే నా అవతారం చూసి నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు’ అని శాండ్రో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Next Story