తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడి

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సోమవారం జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. జర్మనీకి చెందిన లిటియాటో జీఎంబీహెచ్(Liteauto GmbH) కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జర్మన్ రాయబారి వాల్టర్ సమక్షంలో అగ్రిమెంట్లను మార్చుకున్నారు. రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 9వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ కంపెనీ కార్లు, కామ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, [&hellip;]</p>

తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సోమవారం జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. జర్మనీకి చెందిన లిటియాటో జీఎంబీహెచ్(Liteauto GmbH) కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జర్మన్ రాయబారి వాల్టర్ సమక్షంలో అగ్రిమెంట్లను మార్చుకున్నారు. రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 9వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ కంపెనీ కార్లు, కామ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు సంబంధించిన మెగ్నీషియం భాగాల‌ను ఉత్పత్తి చేయ‌నుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జర్మనీ కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పెట్టబడులకు స్వర్గధామం తెలంగాణ అన్నారు. తెలంగాణలో ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకు 2 వేల ఎక‌రాల స్థలం అందుబాటులో ఉంద‌ని, ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు.

జ‌ర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామిక‌వేత్తల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వెల్లడించారు. ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ పాల‌న‌లో ఎన్నో కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించామని, తొలి ప్రాధాన్యత‌గా విద్యుత్ స‌మ‌స్యను ప‌రిష్కరించినట్లు తెలిపారు. అన్ని రంగాల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప‌రిశ్రమ‌ల‌కు సింగిల్ విండో విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నామ‌ని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చ‌ట్టం లేద‌ని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే 17,500 కంపెనీల‌కు ఇప్పటి వ‌ర‌కు క్లియ‌రెన్స్ ఇచ్చామ‌న్నారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్రమ‌లే జీడీపీ వృద్ధికి స‌హ‌క‌రిస్తున్నాయన్నారు.

Next Story