- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 5 వరకు జనరల్ బజార్ మూసివేత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్‌లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండటంతో వ్యాపారస్తుల్లో కరోనా భయం పట్టుకుంది. దీంతో రేపటి నుంచి జూలై 5వ తేదీవరకు జనరల్ బజార్‌ను మూసివేయనున్నట్టు సిల్క్ క్లాత్ అసోసియేషన్ బుధవారం సర్క్యూలర్ జారీ చేసింది. బట్టల షాపుల వారే కాకుండా మిగతా అన్ని దుకాణాలు మూసి వేయాలని సర్క్యూలర్‌లో […]</p>
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్‌లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండటంతో వ్యాపారస్తుల్లో కరోనా భయం పట్టుకుంది. దీంతో రేపటి నుంచి జూలై 5వ తేదీవరకు జనరల్ బజార్‌ను మూసివేయనున్నట్టు సిల్క్ క్లాత్ అసోసియేషన్ బుధవారం సర్క్యూలర్ జారీ చేసింది. బట్టల షాపుల వారే కాకుండా మిగతా అన్ని దుకాణాలు మూసి వేయాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. కరోనా కట్టడికి ఈ నిర్ణయం కొంత మేర ఉపయోగపడుతుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






