- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీల్ చేయడానికి సిగ్గుపడుతున్న రామ్.. వీడియో షేర్ చేసిన జెనీలియా
<p>దిశ, వెబ్ డెస్క్:’రెడీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన జంట రామ్, జెనీలియా. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుండి రామ్, జెనీలియా మధ్య ఫ్రెండిషిప్ మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు రామ్, జెనీలియా ఇంటికి వెళ్లి వారి పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తాడు. వాటికి సంబంధించిన ఫోటోలను జెనీలియా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ జంట మరోసారి కలిసి […]</p>

దిశ, వెబ్ డెస్క్:’రెడీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన జంట రామ్, జెనీలియా. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుండి రామ్, జెనీలియా మధ్య ఫ్రెండిషిప్ మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు రామ్, జెనీలియా ఇంటికి వెళ్లి వారి పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తాడు. వాటికి సంబంధించిన ఫోటోలను జెనీలియా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ జంట మరోసారి కలిసి రచ్చ చేసారు. ‘రెడీ’ సినిమాలోని అయ్యో అయ్యో దానయ్య సాంగ్ కి ఇద్దరు కలిసి రీల్ చేయడానికి ప్రయత్నించారు. చేతికి కట్టుతో జెనీలియా, సిగ్గుపడుతూ రామ్ వేసిన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోను జెనీలియా షేర్ చేస్తూ అయ్యో అయ్యో అయ్యో .. బాబు గారు ఫస్ట్ టైం రీల్ చేస్తున్నారు కదా… సిగ్గు పడుతున్నారు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇకపోతే రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బై లింగువల్ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.






