- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతి పాఠశాలలో జెనీలియా పిల్లలు
<p>హీరోయిన్ జెనీలియా తన పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తుంటుంది. వారి భవిష్యత్ ఎలా ఉంటుందనే భావనతో అప్పుడప్పుడు భయం కూడా వేస్తుందని చెప్తోన్న జెనీలియా.. పిల్లలకు ప్రకృతిని, పశువులను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. లాక్‌డౌన్‌లో ముంబైకి దూరంగా సొంత గ్రామంలోనే గడుపుతున్నామని చెప్పిన జెనీలియా.. లాక్‌డౌన్ ఎత్తేయడంతో పిల్లల్ని పొలాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చిందని తెలిపింది. ఇక్కడ కొత్త క్లాస్ రూమ్ కూడా దొరికిందంటూ.. ఒక పురాతన చింత చెట్టు కింద […]</p>

హీరోయిన్ జెనీలియా తన పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తుంటుంది. వారి భవిష్యత్ ఎలా ఉంటుందనే భావనతో అప్పుడప్పుడు భయం కూడా వేస్తుందని చెప్తోన్న జెనీలియా.. పిల్లలకు ప్రకృతిని, పశువులను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
లాక్‌డౌన్‌లో ముంబైకి దూరంగా సొంత గ్రామంలోనే గడుపుతున్నామని చెప్పిన జెనీలియా.. లాక్‌డౌన్ ఎత్తేయడంతో పిల్లల్ని పొలాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చిందని తెలిపింది. ఇక్కడ కొత్త క్లాస్ రూమ్ కూడా దొరికిందంటూ.. ఒక పురాతన చింత చెట్టు కింద తన పిల్లలను చదివిస్తున్న వీడియోను షేర్ చేసింది. ‘ప్రకృతి ఒడిలో చదువుకునే అదృష్టం తన పిల్లలకు దొరికినందుకు సంతృప్తిగా ఉంది. అంతేకాదు తన కొడుకులు ఇప్పుడు పర్యావరణం, పశువులను ప్రేమగా చూస్తున్నారు.. అందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు చెప్పినట్లు భూమిని మన పూర్వీకుల నుంచి వారసత్వంగా తీసుకోలేదు.. పిల్లల గురించి అప్పుగా తీసుకున్నాం అంతే’ అంటోంది.






