- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జెనీలియా ‘మాస్క్ బనావో’ పిలుపు
<p>బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్తుండటంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలో తోటివారికి కాస్త హెల్ప్ చేద్దామని చెప్తోంది జెనీలియా. మీ ఇంటి కప్ బోర్డ్‌లో పాత దుస్తువులు […]</p>

బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్తుండటంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలో తోటివారికి కాస్త హెల్ప్ చేద్దామని చెప్తోంది జెనీలియా. మీ ఇంటి కప్ బోర్డ్‌లో పాత దుస్తువులు ఉంటే.. వెంటనే వాటితో మాస్క్‌లు తయారుచేసే పనిలో నిమగ్నమవ్వండని సూచిస్తోంది. ‘మనకు మన ఫ్యామిలీ, స్నేహితులు ఉన్నారు.. మనం ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటున్నాం.. కానీ ఎలాంటి అండలేని చాలా మందికి మాస్క్ అవసరం ఉంది. లేదంటే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడే చాన్స్ ఉంది. అలాంటివారికి మీరు తయారు చేసే మాస్క్ చాలా ఉపయోగపడుతుంది’ అని తెలిపింది. నాకు సాధ్యమైనన్ని మాస్క్‌లు తయారు చేసేందుకు ప్రతిజ్ఞ చేశానని చెప్తోన్న బొమ్మరిల్లు హాసిని.. ‘జెమిని మాస్క్ బనావో’ ఉద్యమంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. మీ భాగస్వామ్యం కూడా అవసరమని పిలుపునిస్తున్న జెనీలియా.. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం పాత బట్టలతో ఇతరులకు సహాయపడే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతోంది.
View this post on InstagramA post shared by Genelia Deshmukh (@geneliad) on






