లింగ సమానత్వ సాధనకు ‘జెండర్ పార్కు’ ఎక్కడో తెలుసా?

by  |
లింగ సమానత్వ సాధనకు ‘జెండర్ పార్కు’ ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: స్త్రీ, పురుషుడు ఇద్దరూ సమానమే.. జెండర్ బేసిస్‌పై వివక్ష చూపరాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ, ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్య సమాజంలో మహిళలను తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. ఆమె.. వంటింటికే పరిమితమని.. పనుల్లో నిమగ్నమై ఉండాలని సంప్రదాయాల పేరిట కట్టబాట్లు విధించారు. కాగా, ఇప్పుడిప్పుడే మహిళలు వాటిని ధిక్కరిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర సర్కారు లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించేందుకు ‘జెండర్ పార్కు’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల నిధులు ఖర్చు చేసి ప్రభుత్వం పార్కు నిర్మిస్తోంది. దీనిని వచ్చే నెల 11న కేరళ సీఎం పినరయి విజయన్ ప్రారంభించబోతున్నారు.

అదేరోజున సీఎం విజయన్.. పార్కు క్యాంపస్‌లో ఐక్యరాజ్యసమతి భాగస్వామ్యంతో నిర్మించే ఇంటర్నేషనల్ ఉమన్స్ ట్రేడ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IWRTC)కి శంకుస్థాపన చేయనున్నారు. ఉమన్ ఎంట్రప్రెన్యూర్స్‌ ప్రొడ్యూస్ చే ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం ఈ సెంటర్ మార్కెటింగ్ ఇస్తుందని, వారిని ఎంపవర్ చేస్తుందని ఆఫీసర్లు పేర్కొన్నారు. కోజికోడ్ నగరంలో 24 ఎకరాల పార్కు క్యాంపస్‌లో ఏర్పాటయ్యే IWRTC ఉమన్ ఎంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటయ్యే తొలి సెంటరని వివరించారు. ‘జెండర్ పార్కు’లో మ్యూజియం, లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, ఆంఫీ థియేటర్‌ను సీఎం ప్రారంభిస్తారని శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి కె.కె.శైలజ చెప్పారు. వచ్చే నెల నుంచి పార్కు యాక్టివిటీస్ స్టార్టవుతాయని తెలిపారు. జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడంలో అందరూ భాగస్వాములవుదామని మంత్రి పిలుపునిచ్చారు. సమాజ పరిణామ క్రమంలో మహిళ ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు, ప్రస్తుత పరిస్థితులపై మ్యూజియంలో ప్రదర్శనలు ఉంటాయన్నారు. వినూత్న ఆలోచనతో పార్కు ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్రసర్కారును ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రశంసించింది.



Next Story