ట్రంప్ స్పీచ్ … ‘DDLJ’ సీక్వల్ ప్లాన్

161

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (DDLJ)’ .. షారుక్ ఖాన్, కాజోల్ ప్రేమ కావ్యం. 1995లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఇండియాలో రూ.100 కోట్ల కలెక్షన్స్ పొందిన ఈ చిత్రం… ఓవర్సీస్‌లో రూ. 16 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన సినిమాను యశ్ చోప్రా నిర్మించారు. చిత్రానికి జతిన్-లలిత్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది. అయితే ఈ మధ్య భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించారు. అంతకు ముందు కూడా బరాక్ ఒబామా ఇండియన్ క్లాసికల్ హిట్ DDLJను తన ప్రసంగంలో చేర్చారు. దీంతో షారుక్ సతీమణి గౌరీ ఖాన్ ఓ నిర్ణయానికి వచ్చారు. DDLJకు సీక్వెల్ తీసేందుకు డిసైడ్ అయ్యారు. DDLJ డైరెక్టర్ ఆదిత్య చోప్రానే సినిమా సీక్వెల్ చేస్తారని ప్రకటించారు. వీలైతే స్వయంగా సినిమాను నిర్మించే యోచనలో ఉన్నారట.

కాగా 2018లో ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుక్ ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. అట్లీ, రాజ్ కుమార్ హిరాని, ఆషిక్ అబు దర్శకుల కథలు విన్నా… ఈ చిత్రాలు చేస్తాడా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.