- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఆరోగ్యంగా ఉన్నాను : గంగూలీ
<p>దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గత శనివారం స్వల్ప గుండెపోటుతో కోల్‌కతా లోని వుడ్‌లాండ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఒక స్టెంట్ వేసిన డాక్టర్లు.. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడారు. ‘తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు నా కృతజ్ఞతలు. నేను తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడానికి వాళ్లు ఎంతో […]</p>

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గత శనివారం స్వల్ప గుండెపోటుతో కోల్‌కతా లోని వుడ్‌లాండ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఒక స్టెంట్ వేసిన డాక్టర్లు.. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడారు. ‘తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు నా కృతజ్ఞతలు. నేను తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడానికి వాళ్లు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నాను. త్వరలోనే విమాన ప్రయాణాలు కూడా చేస్తాను. ఇక నా ఆరోగ్యం మెరుగుపడాలని ఎంతో మంది కోరుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు. మరో మూడు నాలుగు వారాలు విశ్రాంతి తీసుకొని తన దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చని డాక్టర్లు చెప్పారు’ అని గంగూలీ వెల్లడించారు. గంగూలీ ఆరోగ్య స్థితిని కొన్ని రోజుల పాటు ఇంటిలోనే వైద్యులు పరిశీలించనున్నారు.






