- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో నిర్భయ ఘటన.. కదలుతున్న రైలులో యువతిపై దారుణంగా..
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో నిర్భయ ఘటనను తలపించింది. కదులుతున్న రైలుతో కొందరు వ్యక్తులు 20 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. లక్నో నుంచి ముంబైకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్‌పురీ, కాసారా రైల్వేస్టేషన్ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు స్పీడ్ కొంచెం తగ్గింది. ఆ సమయంలో 8 మంది దుండగులు మారణాయుధాలతో రైలులోని డీ-2 […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో నిర్భయ ఘటనను తలపించింది. కదులుతున్న రైలుతో కొందరు వ్యక్తులు 20 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. లక్నో నుంచి ముంబైకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఇగత్‌పురీ, కాసారా రైల్వేస్టేషన్ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు స్పీడ్ కొంచెం తగ్గింది. ఆ సమయంలో 8 మంది దుండగులు మారణాయుధాలతో రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు. అనంతరం మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించారు. వారి ఫోన్లను, నగలను, డబ్బులను లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే రైలులో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే.. రైలు కాసారా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక.. ప్రయాణికులు సహాయం కోసం కేకలు పెట్టారని రైల్వే పోలీసు కమిషనర్ కైసర్ ఖలీద్ ట్విట్టర్‌లో తెలిపారు. ఆ సమయంలో స్పందించిన పోలీసు సిబ్బంది.. దుండగుల్లో నలుగురిని పట్టుకున్నారని చెప్పారు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఖలీద్ పేర్కొన్నారు.
- Tags
- maharashtra






