10,116 స్పటిక లింగాలతో వినాయకుడి విగ్రహం

by velandi.Saikiran |   (  Updated:2025-08-29 09:03:34  IST  )

సిరిసిల్ల పట్టణం 36వ వార్డు వెంకంపేట రాంలాల్ మండప్ నిర్వాహకులు స్పటిక లింగాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు

10,116 స్పటిక లింగాలతో వినాయకుడి విగ్రహం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం 36వ వార్డు వెంకంపేట రాంలాల్ మండప్ నిర్వాహకులు స్పటిక లింగాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర బాడర్ లో కలకత్తా కాలకారులతో రెండు లక్షలకు పైగా వెచ్చించి, 3 నెలల కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. పర్యావరణానికి హాని కలగకుండా పూర్తిగా బంకమట్టి, కర్రలు, గడ్డితో ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారుచేయడం ఈ విగ్రహ విశేషమైతే, ప్రత్యేకంగా తెచ్చిన 10,116 స్పటిక లింగాలను మట్టి వినాయకుడికి అలంకారప్రయంగా అమర్చడం ప్రత్యేకత.

17 సంవత్సరాలుగా వివిధ రూపాలలో ఏర్పాటు చేసి గణేశున్నీ ఆరాధిస్తున్నామని, 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్పటిక లింగాలతో అమర్చిన వినాయకుని ఏర్పాటు చేసి పూజిస్తున్నట్లు మండప నిర్వహకులు తెలిపారు. నిమజ్జనం రోజు స్పటిక లింగ గణపతికి పాలాభిషేకం చేసి విగ్రహానికి అమర్చిన స్పటిక లింగాలను ప్రజలు, భక్తులకు పంచుతామని వారు అంటున్నారు. కాగా తండ్రి శివయ్య రూపమైన లింగాలను అమర్చిన ఈ బొజ్జ గణపయ్య వీక్షించడానికి పట్టణ నలుమూలల ప్రజలు, భక్తులు బారులు తీరుతున్నారు.

Next Story